కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామ శివారులో చిరుత పులి ( Leopard ) సంచారం ఆందోళన కలిగిస్తుంది. గురువారం దుబ్బగూడెం శివారులోని పంట పొలాల్లో చిరుత పులి సంచరిస్తునట్లు సమాచారం మేరకు బెల్లంపల్లి డివిజన్ ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా చిరుత పులి పాద ముద్రలను గుర్తించారు.
గత ఏడాది సైతం ఇదే ప్రాంతంలో పెద్ద పులి సంచరించగా ఇప్పుడు చిరుత పులి సంచారంతో గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు. పంట పొలాలకు, గ్రామ శివార్లకు వెళ్లే రైతులు, గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఎస్ వో శ్రీనివాస్, యానిమల్ ట్రాకర్స్, సిబ్బంది ఉన్నారు.