Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు అందజేసి.. విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో భాగంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని సంతోష్ రావుకు అందజేసిన నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సంతోష్ రావు మాట్లాడుతూ.. రేపు సిట్ విచారణకు హాజరవుతా.. సిట్ ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 10 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన చార్జిషీటు దాఖలు చేశామని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ ఇప్పటికే వెల్లడించారు.
Proteins Makthal | జాతీయ జెండావిష్కరణలో అపశృతి.. ఒకరికి గాయాలు, మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం : వీడియో
ప్రోటీన్లు కావాలంటే నాన్ వెజ్ తినాల్సిన పనిలేదు.. వీటిని కూడా తినవచ్చు..!