బోడుప్పల్, జనవరి30 : బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచెర్ల స్లాటర్ హౌజ్లో(Slaughter house) షాట్ సర్క్యూట్ (Shot circuit) చోటు చేసుకుంది. ఒక్కసారిగా పొగలు దట్టంగా అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..