Supreme Court | దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య భర్తల మధ్య జరిగిన వివాదం కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఇలా స్పందించింది. సదరు వ్యక్తి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సదరు మహిళ ఐపీఎస్ అధికారి కావడంతో తన క్లయింట్ కావడంతో ఎప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టుకు తెలిపారు. దాంతో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ బెంచ్ స్పందిస్తూ.. ‘దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కారు’ అని పేర్కొంది.
ఇరుపక్షాలు కూర్చొని చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించింది. సదరు వ్యక్తి వ్యాపారవేత్త అని.. సదరు వ్యక్తి వ్యాపారవేత్త అని, ఆమె ఐపీఎస్ అధికారిని అని పేర్కొన్న కోర్టు.. ఇద్దరు కోర్టు సమయాన్ని వృథా చేసే బదులు ఇద్దరూ కూర్చొని వివాదానికి ముగింపు పలకాలని సూచించింది. ఎవరైనా బాధితులుగా మారితే.. వారిని రక్షించేందుకు తాము ఉన్నామని తెలిపింది. సదరు వ్యాపారవేత్త తరఫున న్యాయవాది మాట్లాడుతూ తన క్లయింట్‌తో పాటు తండ్రిపై ఐపీఎల్ మహిళా అధికారి కేసు దాఖలు చేసిందని.. దాంతో ఇద్దరూ జైలు పాలయ్యారని తెలిపారు. జూన్, 2022లో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల్లో ఆ వ్యక్తి తల్లిదండ్రులపై నమోదైన క్రిమినల్ కేసును త్వరగా ముగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.
విచారణ సందర్భంగా ఐపీఎస్ అధికారి పోలీస్ సర్వీస్‌లో చేరిన సమయంలో తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తప్పుడు సమాచారం అందించారని.. ఆ సమయంలో మహిళా అధికారిపై రెండు కేసులు నమోదైనట్లుగా డిఫెన్స్ న్యాయవాది ఆరోపించారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘మీ ప్రాణాలను కాపాడుకోవడం కోసం కంటే మహిళా అధికారి తన ఉద్యోగాన్ని ఎలా కోల్పోతారనే దానిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ, మహిళా అధికారి జీవితాన్ని నాశనం చేసే క్రమంలో మీ సొంత జీవితం కూడా నాశనం అవుతుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మహిళా అధికారి ఏదైనా తప్పు చేసి ఉంటే హోం మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది. కేసు విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.
Elon Musk | నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయిన ఎలాన్ మస్క్
Congress MP | మహిళపై నాలుగేళ్లుగా అత్యాచారం.. కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్