Sikandar | గతేడాది పుష్ప 2 ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా. ఈ భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉందని తెలిసిందే. ఇప్పటికే ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న సికిందర్ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
కాగా ఈ భామ మరోసారి సల్లూభాయ్‌తో రొమాన్స్ చేయబోతుందన్న క్రేజీ వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) డైరెక్షన్లో రాబోతున్న చిత్రం ఆట్లీ 6 (Atlee 6). సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో కూడా రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుందని, దీనికి సంబంధించి సైన్ కూడా చేసిందని బీటౌన్ సర్కిల్ టాక్.
ఇదే నిజమైతే మరి అట్లీ రష్మికను సిల్వర్ స్క్రీన్‌పై ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని ఫిలిం నగర్ సర్కిల్ టాక్. ఒక సినిమా విడుదల కాకముందే మరో ఒకే స్టార్ హీరో మరో సినిమాకు సంతకం చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది రష్మిక మందన్నా.
ప్రస్తుతం రష్మిక మందన్నా విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ఛావా చిత్రంలో నటిస్తోంది. మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ నటిస్తోన్న కుబేరలో హీరోయిన్గా నటిస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా చేస్తుంది.
Our trusted sources have revealed that #RashmikaMandanna has been signed up for #Salman #Khan and director #Atlee’s upcoming project. The actress is currently filming #Sikandar.
Read more at the link in our bio. 🔗#News pic.twitter.com/eOKokEmo64
— Filmfare (@filmfare) January 30, 2025
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!