అమరావతి : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ( Kumbh Mela) తిరుమల, తిరుపతి దేవస్థానానికి చెందిన ఉద్యోగి (TTD employee) ఒకరు అదృశ్యమైన (Missing) సంఘటన కలకలం సృష్టిస్తోంది. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు, టీటీడీ ఉద్యోగులు ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
కుంభమేళాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకుగాను టీటీడీకి చెందిన 2వందల మంది ఉద్యోగులను, సిబ్బందిని విధులకు అక్కడికి పంపించారు. కుంభమేళా ప్రారంభం నాటి నుంచి అక్కడే ఉన్న ఉద్యోగుల్లో దీవేటి సుబ్రహ్మణ్యం (Subramanyam) అనే ఉద్యోగి బుధవారం నుంచి కనిపించకుండా పోయాడు.
దీంతో స్థానిక పోలీసులకు, టీటీడీ ఈవోకు ఉద్యోగులు సమాచారం అందించారు. నిన్నటి నుంచి ఉద్యోగి సుబ్రహ్మణ్యం కోసం కుంభమేళాలో గాలింపు మొదలు పెట్టారు. ఉద్యోగి ఆచూకి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.