KTR | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. షాబాద్‌లో జరిగిన సంఘటన అతి దారుణమైంది. అందరం కూడా కలత చెందే ఒక దరిద్రమైన వార్త అని కేటీఆర్ అన్నారు.
పోక్సో లాంటి ఘటన జరిగిన తర్వాత, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన తర్వాత వారికి బెయిల్ ఇవ్వడం.. బెయిల్ ఇచ్చే క్రమంలో న్యాయమూర్తుల దగ్గర ప్రభుత్వం తన వాదనలను పటిష్టంగా వినిపించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఏ అమ్మాయి మీదైతే అత్యాచారం జరిగిందో.. అఘాయిత్యం జరిగిందో.. ఆ అమ్మాయి,కుటుంబసభ్యులు భయపడుతూ దయచేసి ఆ దుర్మార్గుడికి బెయిల్ ఇవ్వొద్దు అని చెప్తుంటే కూడా మీరు పెడచెవిన పెట్టి కోర్టులో న్యాయమూర్తికి సరిగ్గా నివేదించకపోవడం వల్ల ఈ దుర్మార్గం జరిగిందన్నారు.
ఎవరు బాధ్యులు..?
షాబాద్‌లో జరిగిన ఆరు హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యలేనని కేటీఆర్ అన్నారు. ఈ ఆరుగురి హత్యకు కచ్చితంగా హోంశాఖ వైఫల్యం, నిందితుడికి బెయిల్ వచ్చేలా నిర్లక్ష్యంగా వాదించిన న్యాయవాదుల వైఫల్యమే కారణమన్నారు. రేవంత్ రెడ్డి కచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇట్లాంటి దుర్మార్గులకు బెయిల్ ఎందుకు ఇస్తున్నరు. ఏ కారణం చేత వాళ్లకు బెయిల్ ఇచ్చి ఈ మానవ మృగాలను సమాజంలోకి మీరు వదులుతున్నారు. ఎవరు బాధ్యులు..? అని కేటీఆర్ అడిగారు.
ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నా.. ఎంత బాధ అవుతది.. అఘాయిత్యం జరుగడమే ఘోరమంటే.. అఘాయిత్యం జరిగిన తర్వాత పబ్లిక్‌గా వచ్చి చెప్పుకోవడమే భయంకరమైన పరిస్థితి అంటే దాని మీదికెళ్లి ఇవాళ ఆ మానవ మృగాలకు బెయిళ్లు ఇచ్చి వాళ్ల పలుకుబడి, డబ్బులను ఉపయోగించుకొని అఘాయిత్యాలు చేస్తుంటే సిగ్గులేకుండా పబ్లిక్ ప్రాపిక్యూటర్లు నోరు మూసుకుని కూర్చుని.. ఏ ధైర్యంతో రేపటి రోజున ఆడపిల్లలు ఏమన్నా జరిగితే బయటకు వచ్చిఫిర్యాదు చేస్తరని ప్రశ్నించారు. తల్లిదండ్రులు భయపడరా.. ? సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అని ఫైర్ అయ్యారు.
షాబాద్‌లో జరిగిన ఆరు హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యలు
పోక్సో కేసుల్లో కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు పటిష్టంగా వాదనలు వినిపించక పోవడం వల్లే నిందితుడికి బెయిల్ వచ్చింది
ఈ ఆరుగురి హత్యకు కచ్చితంగా హోంశాఖ వైఫల్యం, నిందితుడికి బెయిల్… https://t.co/qhxPBd1hU8 pic.twitter.com/yGdM4bBFCZ
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026
Riddhi Chauhan: 300 మంది అమెరికా నేవీ క్యాడెట్స్‌కు లీడర్‌గా భారతీయ విద్యార్థిని