RS Praveen kumar | కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను కాపాడుకునే నాథుడు ఉన్నాడా..? అని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షాబాద్ ఉదంతం గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మే 16వ తేదీన ఆ అమ్మాయి తల్లి ఫిర్యాదు చేసింది. నిందితుడు ఎవరో చెప్పింది.. మొత్తం గ్రాఫికల్‌గా ఏమేం చేసింది అంతా చెప్పింది. చెప్తే అసలు అతన్ని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే దాకా కూడా అరెస్ట్ చేయలేదన్నారు.
నేను ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన సెషన్స్ జడ్జి (పోక్సో కేసులు) ఎల్బీ నగర్ ఇచ్చిన ఆర్డర్ చూశా. ఆ పిటిషన్లో బ్రదర్ ఆఫ్ రెస్పాండెంట్ (చనిపోయిన అమ్మాయి సోదరుడు) బెయిల్‌ను వ్యతిరేకించాడని ఉంది. అసలు ఆ అమ్మాయికి అన్ననే లేడు. ఆ అమ్మాయికి అక్క ఉంది.. మరి లేని అన్న పోయి బెయిల్ ఎట్లా వద్దంటడని ప్రశ్నించారు. పోక్సో రూల్స్ 2020 ప్రకారం నిందితుడు ఎప్పుడైనా బెయిల్‌కు అప్లై చేసుకుంటే బాధితురాలికి ఒక నోటీసు రావాలి. బాధితురాలిని జడ్జి, మేజిస్ట్రేట్ పిలిచే విధంగా పీపీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆ పీపీ ఎవరో కాదు.. కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్..
కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్‌కి బెయిల్ వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి గౌడ్ షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇచ్చి మహిళలను కాపాడాలి అంటే ఎలా..? అని ప్రశ్నించారు. బాధితులను ఓదార్చడానికి పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు.. అదే అరెస్టులు నిందితులను చేయొచ్చు కదా..? అన్నారు.
కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్‌కి బెయిల్ వచ్చింది
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను కాపాడుకునే నాథుడు ఉన్నాడా?
కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి గౌడ్ షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నాడు… https://t.co/bYs4Xjq61e pic.twitter.com/Xx92eDmbqw
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2026