Mosquito Net | హైదరాబాద్‌లో పలు ఏరియాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ లోపించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి కాలుష్యపూరితమవుతున్నాయి. తద్వారా కొన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తూ నగరవాసులకు కంటి మీద కనుకు లేకుండా పోతుంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దోమ తెరను కప్పుకుని మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు.
తాజాగా మరో సెక్యూరిటీ గార్డు కూడా ఇదే అవతారంలో కనిపించాడు. ఓ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు దోమల బెడదను తట్టుకోలేక దోమ తెరను ఒళ్లంతా కప్పుకొని విధులు నిర్వహిస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఎందుకిలా వేసుకున్నరని రిపోర్టర్ అని అడిగితే దోమల బాధకు మేడమ్ అని చెప్పడం వీడియోలో చూడొచ్చు.
హైదరాబాద్‌ను మూడు ముక్కలుగా విభజించి మరిన్ని సమస్యలు సృష్టించారని… నగరాన్ని మురికికూపం చే సి దోమలకు నిలయంగా మార్చారని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దోమలతో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సమయంలో మాస్క్ ఎలా ధరించామో, ఇప్పుడు దోమల బెడద తట్టుకోలేక మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లో దోమల సమస్యకు ఇదే నిదర్శనం
దోమల బెడదను తట్టుకోలేక తెరలు వేసుకొని గస్తీ కాస్తున్న అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది pic.twitter.com/J1oYmfadGO
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2026
Mahabubabad | చెత్తను ఊడ్చి మున్సిపల్ కార్యాలయంలో పడేసిన ప్రజలు : వీడియో
రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తండ్రి
Ashok Mittal | ఫెమా ఉల్లంఘన ఆరోపణలు.. ఆప్ ఎంపీ ఇల్లు, వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు