Murder | హైదరాబాద్ : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జరిగిన జంట హత్యల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. మృతురాలి రెండో ప్రియుడే వారిని మట్టుబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. జంట హత్యలకు పాల్పడిన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు గురైన యువకుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా, యువతిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా గుర్తించారు.
అక్రమ సంబంధాల నేపథ్యంలో జంట హత్యలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. నానక్‌రామ్‌గూడలో ఉంటున్న అంకిత్‌కు ఎల్బీనగర్లో ఉంటున్న బిందుకు కొన్నేండ్ల క్రితం ఏర్పడిన పరిచయం, అక్రమ సంబంధానికి దారి తీసింది. బిందుకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. అంకిత్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, మరో యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది.
ఈనెల 3న ఇంటి నుండి వెళ్లిపోయిన బిందు.. సాకేత్ వద్దకు చేరుకుంది. తన భార్య బిందు అదృశ్యమైనట్లు భర్త జనవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సాకేత్, బిందు కలిసి.. 12న పుప్పాలగూడ గుట్ట వద్దకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బిందు రెండో ప్రియుడు.. పుప్పాలగూడ గుట్ట వద్దకు చేరుకున్నాడు.
బిందు సాకేత్‌తో ఏకాంతంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని రెండో ప్రియుడు.. ఇద్దరిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అనంతరం బండరాళ్లతో మోది అటు నుంచి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం మూడు బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Manchu Manoj | మోహన్‌బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. మనోజ్‌కు నో ఎంట్రీ
TG EAPCET | టీజీ ఎప్‌సెట్ తేదీలు ఖరారు.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు
Novak Djokovic: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జోకోవిచ్