TGEAPCET | హైదరాబాద్ : తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన విడుదల చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆయా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షలను ఏప్రిల్, మే నెలలో నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీల్లో, ఇంజినీరింగ్ కోర్సులకు మే 2 నుంచి 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
టీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షను మే 12, టీజీ ఎడ్‌సెట్‌ను జూన్ 1, టీజీ లాసెట్, ఎల్ఎల్ఎం కోర్సులకు జూన్ 6, ఐసెట్ పరీక్షలను జూన్ 8, 9 తేదీల్లో, టీజీ పీజీఈసెట్ పరీక్షలను జూన్ 16 నుంచి 19 వరకు, టీజీ పీఈసెట్ ప్రవేశ పరీక్షలను జూన్ 11 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
Armoor | ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు
Chinese manja | విషాదం..ఇద్దరి మెడను కోసేసిన చైనా మాంజా.. హాస్పిటల్‌కు తరలింపు
Harish rao | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలి : హరీశ్ రావు