Harish rao | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలి : హరీశ్ రావు
Harish rao | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని(Indiramma Atmiya Bharosa) కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు.
సిద్దిపేట : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని(Indiramma Atmiya Bharosa) కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని వీరంతా కూలీ పనికి వెళ్లే నిరుపేదలు అని తెలిపారు. ఎస్సీ ఎస్టీ, బీసీ రైతుల ఎక్కువగా ఉంటారు. రాష్ట్రంలో కోటి 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు.
గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించం అని ప్రభుత్వం చెప్పడం దురదృష్ట కరమన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్నా కూలీ కాదు అని అంటున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలీగా గుర్తింపు ఉంటుందనే నిబంధన కూడా సరైంది కాదన్నారు. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్లని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరు అని ప్రభుత్వం చెప్తున్నది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం మార్చి రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇస్తున్నది రూ.1500..ఎగ్గొట్టేది రూ. 12 వేలు
ఐదు గుంటలు ఉన్న రైతుకు సంవత్సరానికి రైతు భరోసా కింద రూ.1500 మాత్రమే వస్తాయి. ఐదు గుంటలు ఉన్న రైతుకు వ్యవసాయ కూలీ కింద రూ.12000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నష్టపోతారని పేర్కొన్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు.. తాతకు ఎకరం భూమి ఉంటే పిల్లలు పంచుకుంటే అది ఐదు గుంటలు వస్తాయి. 5 గుంటలో పంట పండింది లేదు, వారు బతికింది లేదు. 5 గుంటలు ఉన్నందుకు 12 వేల రూపాయలు ఇవ్వం అని ప్రభుత్వం చెప్పడం శోచనీయమన్నారు. రైతు భరోసా కింద మీరు ఇస్తున్నది రూ.1500 అయితే ఎగ్గొట్టేది 12 వేల రూపాయలు.
రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 24 లక్షల 57,000 మంది ఉన్నారు. గుంట, రెండు గుంటలు ఉన్న రైతులు రైతు భరోసా తీసుకోవడం వల్ల రైతు కూలీలకు ఇచ్చే రూ.12,000 నష్టపోతారు. కావున ఇలాంటి రైతులకు రైతు భరోసా కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా గుర్తించాలని ఆయన సూచించారు. ఈజీఎస్ పథకంలో కూలీలు 60 సంవత్సరాల వయసు దాటితే కార్డు కోల్పోతారు. కాబట్టి ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలన్నారు.
గ్రామ సభల ద్వారానే ఎంపిక..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు ప్రకటించాలి.నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. కానీ లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు విడుదల చేయలేదని విమర్శిం చారు. సిద్దిపేట జిల్లాలో 68 వేల దరఖాస్తులు వచ్చాయి. డోర్ టు డోర్ సర్వేలో మిగిలిన ఇళ్లను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఫైనల్ చేస్తారు అని పత్రికల్లో వార్తలు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేది.
అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరై అయిన వారు కొంత నిర్మించుకొని ఉన్నారు. ఇలాంటి ఇళ్లను పూర్తి చేసుకోడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. అందరూ పేదవారే కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

