హైదరాబాద్ : ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. చైనా మాంజా(Chinese manja) కారణంగా కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్రగాయాలపాలవుతున్నారు. తాజాగా కామారెడ్డిలోని (Kamareddy) రామారెడ్డిలో బైక్‌పై వెళ్తున్న జావెద్ అనే వ్యక్తి గొంతుకు చైనా మాంజా తగిలి తీవ్ర రక్తస్రావం అయింది.
గమనించిన స్థానికులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. జావెద్ సైలన్ బాబా కాలనీకి చెందిన వాసిగా గుర్తించారు. మరో ఘటనలో హైదరాబాదర్లోని నారాయణగూడ పీఎస్ లిమిట్స్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. లంగర్‌హౌస్ ట్రాఫిక్ పోలీస్‌గా పని చేస్తున్న శివరాజ్ విధులు ముగించుకొని నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి దిగుతుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుకోవడంతో కొంత మేర చర్మం చీలిపోయింది. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.