నిజామాబాద్ : ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పలు పార్టీల నేతలు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి గెలుపొందారు. తీరా గెలిచాక ప్రజలుకు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. కానీ, ప్రజలు ఇప్పుడిప్పుడే ఇచ్చిన హామీలపై గెలుపొందిన నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరర్చాలనే సదరు నేతలను అడ్డుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి(Paidi Rakesh Reddy) వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు(Wall posters) వెలవడం స్థానికంగా కలకలం రేపింది.
ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వాల్ పోస్టర్లలో ప్రస్తావిస్తూ ఓటర్లు నిలదీశారు. రూపాయికి వైద్యం ఎక్కడ? యువతకు ఉపాధి ఎక్కడ?, నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదకు ఇల్లు ఎక్కడ? అంటూ నిలదీశారు. ఆర్మూర్ నియోజకర్గంతోపాటు నందిపేట్ మండలంలో సైతం పోస్టర్లు అంటించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పోస్టర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.