హైదరాబాద్ : గోషామహల్‌లోని(Goshamahal) చాక్నావాడి ప్రాంతంలో నాలా రోడ్డు(Nala Road) భారీగా కుంగింది(Sagged). దారుస్సలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డు మార్గంలో ఫ్లైవుడ్ దుకాణం ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారు జామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతి పురాతమైన నాలా కావడంతో కుందినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలోను ఇక్కడికి 200 మీటర్ల దూరంలో ఇదే నాలా కుంగింది. పలువురు గాయపడ్డారు. నాలాపై రోడ్డు కుంగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్