BRS MLAs | బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి ఢిల్లీకి బయలుదేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో వారి మీద జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నారు. అసెంబ్లీ వద్ద మాజీ మంత్రులు, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించిన పోలీస్ యంత్రాంగం సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా నలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారు. ఖాకీల దౌర్జన్యంతో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న దృశ్యాలు కాంగ్రెస్ సర్కార్ పాలనలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ కరువైందని చెప్పకనే చెబుతున్నాయి.
ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి
అసెంబ్లీ ప్రాంగణంలో వారి మీద జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయనున్న మహిళా ఎమ్మెల్యేలు https://t.co/p1rO7GRfYV pic.twitter.com/hheMhqt7Q3
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
KCR | కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి.. రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ వ్యూహం రివర్స్
Nitin Gadkari | హైవే పనులు ఆలస్యంపై సిగ్గుపడుతున్నా.. ప్రారంభోత్సవానికి నేను రాను: నితిన్ గడ్కరీ