Mothkupally Narsimhulu | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేం అలసిపోయాం. మీరు పెట్టే అవమానం.. ఈ వ్యవస్థలో మాకు జరిగే అన్యాయాన్ని, అవమానాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణమేంటో మీరే చెప్పాలి. దీని క్కారణమేంటి.. నీ వెనుక గుంతలు తవ్వుతున్నరు.. నల్లికుట్లోళ్లు ఎవరు ..? చెప్పమంటవా..? నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడివే పనిచేస్తే కుదరదు కదా.. వర్గీకరణ అయిన తర్వాత కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశాలు పెడితే నువ్వేమైనా చేయగలిగావా…? అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అసలు అవినీతి పరులను ఒక్కన్నన్నా నువ్వు తీసేసినవా..? ఒక్కడి మీదనన్నా నువ్వు యాక్షన్ తీసుకున్నవా.. అసలు ఎవరు అవినీతి పరులు.. ఈ గుంతలు తవ్వేటోడు ఎవరు..? అవినీతిలో 10 శాతం అని పేరు పడ్డ మంత్రి ఎవరు..? అసలు నీ పార్టీ ఎట్లొస్తది. ఇంత బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకెళ్లి ఎవరిని అడిగినా.. ఒక మంత్రికి 10 పర్సెంట్ అనే పేరుంది ఆయనకు.. 10 పర్సెంట్ అంటే ఆయన పేరు చెబుతురు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నవ్ నువ్వు.
ఒక వ్యక్తి ఎస్సీ, బీసీ, ఓసీ ఎవరైతే ఏంది.. అవినీతి పరుడు ఎవరైనా తీసేయాల్సిందే. ఎందుకు తీసేయ్యలేకపోతున్నవ్.. నీకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా..? నీ పదవి ఉండాలన్నా.. ప్రజలు నీవెంబడి ఉండాలే కదా.. ప్రజలు నీ వెంబడి ఉండాలంటే అవినీతి పరులకు అంతం పలకాలి కదా.. ఈ గొయ్యి తవ్వుతున్నది ఎవరు..? ఇంత అవినీతి పరుడు ఉన్న ప్రభుత్వంఎట్లా నడుస్తదని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి చేస్తున్న ఒక్క మంత్రి మీదైనా చర్యలు తీసుకున్నవా?
ఒక మంత్రి అయితే 10 శాతం కమీషన్లు తీసుకుంటున్నాడు అని బహిరంగంగా చర్చ నడుస్తుంది – మోత్కుపల్లి నర్సింహులు https://t.co/FT1mHrv5st pic.twitter.com/Xnb756eTms
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2026
రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది
– మోత్కుపల్లి నర్సింహులు pic.twitter.com/VQvN2NcTML
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2026
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్