PVR Cinemas | హైదరాబాద్ : పంజాగుట్ట ఎర్రమంజిల్ పీవీఆర్ సినిమా మాల్లో సత్యనారాయణ (45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని తెలిసిందే. హౌస్ కీపింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న సత్యనారాయణ పీవీఆర్ యజమాన్యం నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కార్మికుడికి ఆరోగ్యం బాగాలేకపోతే తీసుకెళ్లి గేటు బైట పడేశారని ఆరోపిస్తున్న మృతుడి భార్య, కుటుంబసభ్యులు ఆరోపించారు.
మృతుడి భార్య మాట్లాడుతూ.. మీ ఉద్యోగి అంటే మీ పీవీఆర్ ఫ్యామిలీలో అతను కూడా ఓ సభ్యుడు. అలాంటి వ్యక్తికి ఏమన్నా అయితే..ఒక హౌస్ కీపింగ్ బాయ్‌ను వాంతులు అయినోడిని.. బాగా లేదు అనుకున్నోడిని తీసుకుపోయి ఎవరైనా గేట్ బయట వేస్తారా.. సార్ ఇదా మీ మానవత్వం. అంబులెన్స్‌ల పెట్టుకున్న మమ్మల్ని మానవత్వం అని అడుగుతున్నరు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. పిల్లలు చిన్నగున్నరు. ఏం చేసుకుని బతుకాలి చెప్పండి. అదే ఉద్యోగిని దగ్గరలో ఉన్న నిమ్స్‌లో చేర్చితే మేం బిల్లు కట్టుకునేటోళ్లంమంటూ బాధితుడి భార్య కన్నీరుమున్నీరైంది. బాధితుడికి న్యాయం చేయాలి.. డౌన్‌డౌన్ పీవీఆర్ అంటూ బాధితుడి తరపు బంధువులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ఎర్రమంజిల్ పీవీఆర్ మెట్రో మాల్లో కార్మికుడు మృతి
యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు సతీష్ మృతి చెందినట్లు బంధువుల ఆరోపణ
కార్మికుడికి ఆరోగ్యం బాగాలేకపోతే తీసుకెళ్ళి గేటు బైట పడేశారని ఆరోపిస్తున్న మృతుడి భార్య, కుటుంబసభ్యులు
మాకు న్యాయం… pic.twitter.com/8Lp9f5ttF5
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2026
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్