KTR | మేడిగడ్డను ముట్టకుండా కన్నెపల్లి నుండి అన్ని జలాశయాలు నింపొచ్చు : కేటీఆర్
KTR |ఒకవైపు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే.. రేవంత్ రెడ్డి ఏమో మా మీద కోపంతో నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం నీళ్లు ఉన్నాయని.. మేడిగడ్డను ముట్టకుండా కన్నెపల్లి నుండి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు అన్ని జలాశయాలు నింపొచ్చునని కేటీఆర్ వివరించారు.
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 2022 వరదల ఫోటోలు చూపి కన్నెపల్లి మునిగిందని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు
ఒకవైపు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే.. రేవంత్ రెడ్డి ఏమో మా మీద కోపంతో నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం నీళ్లు ఉన్నాయని.. మేడిగడ్డను ముట్టకుండా కన్నెపల్లి నుండి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు అన్ని జలాశయాలు నింపొచ్చునని కేటీఆర్ వివరించారు.
రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక చూసి అయినా సోయి తెచ్చుకో రేవంత్ రెడ్డి అని కేటీఆర్ హితవు పలికారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసింది. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి, కానీ 94 మీటర్లకే పంపులు ఆన్ చేయవచ్చు. మరో 100 రోజులు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుంది.
100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల లిఫ్ట్ చేస్తే, గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపి సస్యశ్యామలం చేసే అవకాశం ఉందని ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. మా మీద కక్షతో రైతుల నోట్లో మట్టి కొట్టకు.. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసే కుట్రలో రైతులకు నీళ్లు ఇవ్వకుండా వాళ్లని ఆగం చేయకు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ కోరారు.
కళ్లు ఉండి చూడలేని నువ్వు బుర్రతక్కువ వాడివా.. లేదా..?
గోదావరిలో కళ్ల ముందు లక్ష క్యూసెక్కుల నీళ్లు వరదలాగా కిందకి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవు అన్నవాడు బుర్రతక్కువ వాడా..? లేదా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్రతక్కువ వాడా..? అని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి వద్ద 93 మీటర్ల నుండే నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంటే.. రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకున్న రేవంత్ రెడ్డి బుర్రతక్కువ వాడివో కాదో చెప్పాలన్నారు. అలాగే మేడిగడ్డ వద్ద 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతుంటే కళ్లు ఉండి చూడలేని నువ్వు బుర్రతక్కువ వాడివా.. లేదా వాస్తవాలు చూపించే మేము తెలివి లేనివాళ్లమో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం వల్ల మునిగే భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డ వల్ల మునిగిపోతుంది అంటున్న నీకు బుర్రలేదు..
రైతాంగం మొత్తం కన్నెపల్లి నుండి నీళ్లు ఇవ్వమంటే పట్టించుకోని వాడిని బుర్రతక్కువ వాడు అనాలా లుచ్చా అనాలా..? అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గురువు కోసం నీళ్లు కిందకి వదులుతున్నావా..? అని రైతులు అడిగితే దానికి సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ అనాలా, దరిద్రుడు అనాలా, ఏమనాలో చెప్పాలని కేటీఆర్ అడిగారు.
రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక చూసి అయినా సోయి తెచ్చుకో రేవంత్ రెడ్డి
మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసింది
కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి, కానీ 94… https://t.co/dI9rd7v6Rg pic.twitter.com/d2IP70hl7t
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026
Read Also :
PM Modi | మా దేశం అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానం : ప్రధాని మోదీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం : రేగా కాంతారావు
Riddhi Chauhan: 300 మంది అమెరికా నేవీ క్యాడెట్స్‌కు లీడర్‌గా భారతీయ విద్యార్థిని
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

