అన్నీ త్యాగం చేశారు.. కానీ విఫలమయ్యా.. నీట్ విద్యార్థిని సూసైడ్
నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపానికి గురైన మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అహల్యనగర్ జిల్లా జలాల్పూర్ గ్రామానికి చెందిన అంకితా సాంగ్లే గత శనివారం తన ఇంట్లో సూసైడ్ చేసుకోగా, ఆమె మృతదేహం లభ్యమైంది.
మహదేవపూర్ (పలిమెల), జూలై 27 : నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపానికి గురైన మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అహల్యనగర్ జిల్లా జలాల్పూర్ గ్రామానికి చెందిన అంకితా సాంగ్లే గత శనివారం తన ఇంట్లో సూసైడ్ చేసుకోగా, ఆమె మృతదేహం లభ్యమైంది.
‘నీట్ పరీక్షకు చదువుతున్నప్పుడు నా కోసం మీరు ఎంతో త్యాగం చేశారు. కానీ మీ ఆశలను నేను నెరవేర్చటంలో విఫలమయ్యా’ అంటూ సూసైడ్ లెటర్లో విద్యార్థిని పేర్కొన్నది. నీట్ పరీక్షలో కేవలం 166 మార్కులు రావటంతో ఆమె తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరాఠీ భాషలో ఆమె రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెనకు చెందిన విద్యార్థిని పాగే కృష్ణవేణి నీట్లో ఆశించిన మారులు రాలేదని మనస్తాపం చెంది సోమవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం కృష్ణవేణి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

