పాట్నా : జంతర్ మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌కి వ్యతిరేకంగా బీహార్‌లో ఈ నెల 25న విద్యార్థులు బంద్ నిర్వహించారు. ఈ బంద్‌లో బీహార్‌లో అనేక చోట్ల పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల స్టూడెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. స్టూడెంట్ల మీద కు పోలీసులు తుపాకులతో కాల్పులు జరిపారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సివాన్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఏకే 47తో కాల్పులు జరిపిన వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో.. పోలీసు ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. మరో వీడియోలో ఓ పోలీసు అధికారి రైఫిల్‌తో కాల్పులు జరిపారు. ఇలా పోలీసుల కాల్పుల్లో ముగ్గురికి బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియోలపై ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.