న్యూఢిల్లీ, జూలై 27: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తి హిందు, సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా వేరే మతాన్ని స్వీకరించడం ద్వారా మత మార్పి డి జరిగిన మరుక్షణం నుంచి తమ ఎస్సీ హోదాను కోల్పోతారని స్పష్టం చేస్తూ మార్చి 24న ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
గత తీర్పును పునఃపరిశీలించ వలసిన అవరసం లేదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం జూలై 15 నాటి తన ఉత్తర్వులో పేర్కొంది.