Polytechnic Students | పాలిటెక్నిక్ విద్య ఉనికిని కోల్పోయేలా కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలిపే చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు కదం తొక్కుతున్నారు. రేవంత్ సర్కార్‌పై హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనల పర్వం కొనసాగుతోంది.
శనివారం పాలిటెక్నిక్ విద్యార్థినులు సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద రోడ్డెక్కి కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన 97 జీవోను రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థినీవిద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలో రౌండప్ చేస్తోంది. కంటోన్మెంట్ సంగీత్ జంక్షన్ వద్ద నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఫోన్ చేసి మద్దతు తెలుపుతూ అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97 రద్దు చేసేవరకు పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని వారికి మరోసారి భరోసా ఇచ్చారు.
ఇప్పటికే విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారని తెలిసిందే. మరోవైపు వారికి మద్దతుగా బీఆర్ఎస్వీ నేతలు ధర్నాలు, నిరసనల్లో పాల్గొంటున్నారు. 97 జీవోను రద్దు చేయకుంటే విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/EDIG40t9wO
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
కంటోన్మెంట్ సంగీత్ జంక్షన్ వద్ద నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఫోన్ చేసి మద్దతు తెలుపుతూ, అండగా ఉంటానని హామీ ఇచ్చిన కేటీఆర్
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97 రద్దు చేసేవరకు పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని భరోసా ఇచ్చిన కేటీఆర్
నిరసన తెలుపుతున్న… https://t.co/L1oBBgbtsc pic.twitter.com/o45nEHzGmz
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
KTR | కేటీఆర్‌కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు