Teacher | కాంగ్రెస్ సర్కార్ పాలనలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఆకతాయిలు మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడుతూ పోలీసుల భయం లేకుండా యధేచ్చగా తప్పించుకు తిరుగుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఫిర్యాదులు నమోదైనా నిందితులపై నిఘా పెట్టడంలో, వారిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఇటీవలే షాబాద్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. పోక్సో నిందితుడు రాజ్‌కుమార్‌కు అరెస్ట్ చేయకుండా వదిలేసి షాబాద్ హత్యల ఘటనకు కారణమైన పోలీసుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తు విమర్శలు వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసుల నిర్లక్ష్యంతో పోక్సో కేసు నిందితుడు బాధిత బాలికను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా హైదరాబాద్ – తిలక్‌నగర్‌లోని శ్రీ విద్యా పాఠశాలలో మాథ్స్ టీచర్ రవితేజ విద్యార్థినులను అసభ్యంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ విషయమై విద్యార్థినుల తల్లిదండ్రులు టీచర్‌పై ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైనా ఇప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులను అడిగితే మాకు వేరే పనులు ఉండవా.. విచారణ జరుపుతున్నాం కదా అంటూ కాచిగూడ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను అసభ్యంగా వేధిస్తున్న మాథ్స్ టీచర్ రవితేజపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
షాబాద్ ఘటన జరిగి పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వచ్చినా మారని తీరు
హైదరాబాద్ – తిలక్‌నగర్‌లోని శ్రీ విద్యా పాఠశాలలో విద్యార్థినులను అసభ్యంగా వేధిస్తున్న మాథ్స్ టీచర్ రవితేజ
టీచర్‌పై ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైనా ఇప్పటికీ చర్యలు తీసుకోని పోలీసులు
మాకు వేరే పనులు ఉండవా..… pic.twitter.com/dfoakVnetK
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2026