హైదరాబాద్ : చేపల వేట(Fishing) ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. స్నేహితుల చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి ఫాక్స్ సాగర్ చెరువులో(Fox Sagar pond) చోటు చేసుకుంది. గల్లంతయిన వ్యక్తి కోసం(Person drowns) గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు కలిసి నిన్న సాయంత్రం చేపలు పట్టేందుకు చెరువు దగ్గరకి వెళ్లారు. ఈ క్రమంలో షబ్బీర్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు.
వెంటనే అతడి స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే, రాత్రి నుంచి గజ ఈతగాళ్లతో షబ్బీర్ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Crimes In Telangana | తెలంగాణలో ఏం జరుగుతోంది..! పోలీసులు ఏం చేస్తున్నారు..?
Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు
Encounter | భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి