Talasani Srinivas Yadav | పార్టీ తల్లి లాంటిది.. ఎవరైనా గుర్తుంచుకోండి.. పార్టీ లేకపోతే ఎవ్వరూ లేరు. మనకు పార్టీయే సుప్రీం. పార్టీ జెండా కిందనే మనముంటం. బస్తీలకు పోయి నేను బీఆర్ఎస్ పార్టీ అంటేనే గుర్తు పడుతరు తప్ప.. నిన్ను తీసేసిన తర్వాత నీ దగ్గరకు కూడా ఎవరు రారని గుర్తుంచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
అంబర్పేట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. పులి వ్యవసాయ క్షేత్రంలో పండుకొని ఉంది. మన పెద్దపులి ఎక్కడ పడుకొని ఉంది.. ఒక్కసారి లేచిందనుకో. చూసిర్రు కదా మధ్య మధ్యలో ఇట్లా వచ్చి కనిపించి పోతెనే భయం భయంగా ఉన్నరు. కేసీఆర్ చరిత్ర.. కేసీఆర్ పర్సనాలిటీ. కేసీఆర్కున్న విజ్ఞానం.. కేసీఆర్కు ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నట్వంటి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఉందా..? లేదు కానీ..చిన్నోడు, పెద్దోడు, పొట్టోడు, పొడుగోడు.. ప్రతీ ఒక్కడు ఏది పడితే అది మాట్లాడుతున్నరు. మీరు ధైర్యంగా ఉండండి.. మీ వెనక మేం ఉన్నం. దేనికైనా కానీ తలెత్తి నిలబడటమే తెలుసు తప్ప. తల దించుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు లేదన్నారు.
మనకు పార్టీ కన్న తల్లి లాంటిది
పార్టీ లేకపోతే ఎవరూ మనల్ని గుర్తించరు, పార్టీనే మనకు సుప్రీం అని బీఆర్ఎస్ నాయకులంతా తెలుసుకోవాలి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ pic.twitter.com/ztB6NMAANa
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2026
మన పెద్దపులి వ్యవసాయ క్షేత్రంలో రెస్ట్ తీసుకుంటుంది
మధ్యలో అప్పుడప్పుడు వచ్చిపోతేనే అందరికి భయం భయం అవుతుంది
మన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక మేము ఉన్నాము
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ https://t.co/4keKxyoYNq pic.twitter.com/PI97PhgvqO
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2026