Pakala Srihari Rao | బ్యాంకుల రుణాల ఎగవేతను అరికట్టడంలో విఫలం.. కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేయాలి : పాకాల శ్రీహరి రావు
Pakala Srihari Rao | 'వన్ టైమ్ సెటిల్మెంట్' (OTS) లేదా రుణమాఫీల ద్వారా ప్రజాధనం వృథా కాకుండా చూడటానికి, బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం, RBI/SEBI తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
Pakala Srihari Rao | గౌరవ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వేలాది కోట్ల రూపాయిల బ్యాంకుల రుణాల ఎగవేతను అరికట్టడంలో విఫలమైనందుకు ప్రజలనుంచి పెద్ద ఎత్తున తరుగుబాటు రాకముందే గౌరవంగా రాజీనామా చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి
అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు డిమాండ్ చేశారు.
జీ గ్రూప్, ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర కుటుంబానికి చెందిన వివిధ కంపెనీలకు రూ. 22,000 కోట్లకు పైగా ఉన్న వ్యక్తిగత పూచీకత్తు (Personal Guarantee) రుణ బాధ్యతలకు గాను, NCLT ద్వారా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి దాదాపు 99.97% అపారమైన రాయితీ (Haircut) పొందేందుకు ఆమోదం లభించడం వెనుక ఎవ్వరైనా పెద్దల హస్తం ఉన్నదేమో తేల్చి, అప్పు ఇచ్చిన అధికారులపైన, ఎగవేత దారులపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటువంటి ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) లేదా రుణమాఫీల ద్వారా ప్రజాధనం వృథా కాకుండా చూడటానికి, బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం, RBI/SEBI తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
పూచీకత్తు లేని (Collateral-Free) రుణాలపై విచారణ :
అంత భారీ మొత్తంలో అసలు పూచీకత్తు లేకుండా రుణాలు ఏ ప్రాతిపదికన మంజూరు చేశారు..? ఆ సమయంలో బ్యాంకింగ్ భద్రతా నియమాలను, ప్రామాణిక విధివిధానాలను పక్కనబెట్టిన అధికారులపై క్రిమినల్ విచారణ జరిపి తగిన శిక్ష విధించాలని పాకాల శ్రీహరి రావు డిమాండ్ చేశారు. ఈ తరహా ఎగవేతల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్షణమే జోక్యం చేసుకుని, ఉన్నత న్యాయస్థానాలలో అప్పీలు చేయడంతో పాటు పూర్తి బకాయిల రికవరీకి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Read Also :
సెప్టెంబర్ 1న ఉమ్మడి నల్లగొండ జిల్లా జూనియర్ బాలికల ఫుట్బాల్ జట్టు ఎంపికలు
Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలి.. ఎస్ఐకి గాయాలు!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

