Talasani Srinivas Yadav | ఈ నెల 14 న ఖైరతాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నామని.. ప్రత్యేక ఓటరు సవరణ (SIR)కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అధ్యక్షతన జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మాజీమంత్రి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
తెలంగాణ భవన్లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేలా బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతగా భావించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసిందా..? అని ప్రజలను అడగాలని నిర్దేశించారు.
పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అంకిత భావంతో కష్టపడి పని చేసే వారికే పార్టీలో సముచిత స్థానం, గుర్తింపు లభిస్తాయన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వం లో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచిన గులాబీ జెండా పార్టీ నుండి వెళ్లిపోయిన వారిని ఎట్టి పరిస్థితి లో తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని.. మోసాలు, అబద్దాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే ముఖ్యమంత్రి పండబెట్టి తొక్కుతా అంటున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది.. ఏం చేశారని అప్పులు చేశారు. కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయి నానా తిట్లు తిడుతున్నారు.కాంగ్రెస్ పోవాలి… కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. రెండున్నర సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే అని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర