e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News కూక‌ట్‌ప‌ల్లి కాల్పుల ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి

కూక‌ట్‌ప‌ల్లి కాల్పుల ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి

కూక‌ట్‌ప‌ల్లి కాల్పుల ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి

హైద‌రాబాద్ : కూక‌ట్‌ప‌ల్లి ప‌టేల్‌కుంట పార్కు స‌మీపంలో ఉన్న‌ హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం వ‌ద్ద గురువారం మ‌ధ్యాహ్నం కాల్పులు క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం విదిత‌మే. ఈ కాల్పుల్లో ఏటీఎం వ్యాన్ సెక్యూరిటీ సిబ్బంది అలీ ఆస్ప‌త్రిలో ప్రాణాలు కోల్పోయాడు. డ‌బ్బులు నింపే వ్య‌క్తి చికిత్స పొందుతున్నాడు.

ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించిన సీపీ స‌జ్జ‌నార్

కూక‌ట్‌ప‌ల్లి కాల్పుల ఘ‌ట‌నాస్థ‌లిని సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఏటీఎంలో రీఫిల్ చేస్తున్న రూ. 5 ల‌క్ష‌ల న‌గ‌దును ఇద్ద‌రు దుండ‌గులు ఎత్తుకెళ్లార‌ని తెలిపారు. ఏటీఎం వ్యాన్‌ను ఫాలో అవుతూ దుండ‌గులు ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు సీపీ పేర్కొన్నారు. ఘ‌ట‌నాస్థ‌లిలో రెండు బుల్లెట్లు, బుల్లెట్ లాక్‌, హెల్మెట్‌తో పాటు కొన్ని కీల‌క ఆధారాలు సేక‌రించామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న‌ను ప‌రిశీలిస్తుంటే దుండ‌గులు ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కారం రెక్కీ నిర్వ‌హించి చోరీ చేసిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. దుండ‌గుల కోసం చెక్‌పోస్టుల వ‌ద్ద పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌ని సీపీ స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌న్నారు. నిందితులిద్ద‌రూ 25 నుంచి 30 ఏండ్ల వ‌య‌సులోపు ఉన్న‌వారేన‌ని పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పుల క‌ల‌క‌లం

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై మంత్రి ఈట‌ల స్ప‌ష్ట‌త‌

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి ఈట‌ల ఫైర్‌

కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పుల క‌ల‌క‌లం

తెలంగాణలో కొత్తగా 7,994 కరోనా కేసులు

క‌రోనా ఎఫెక్ట్‌.. చార్‌ధామ్ యాత్ర ర‌ద్దు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కూక‌ట్‌ప‌ల్లి కాల్పుల ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి

ట్రెండింగ్‌

Advertisement