Musi strike| కాంగ్రెస్ సర్కార్ మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్న విధ్వంసాన్ని బాధితులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో తాము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఒప్పుకోమని బాధితులు వాపోతున్నారు. కాగా మూసీ సుందరీకరణపై ఆందోళన మూడవ రోజుకు చేరింది. మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా.. ఈ నిరాహార దీక్షకు మూసీ జనందోళన కమిటీ సభ్యులు, శ్రీరామ్ నగర్, గంధం గూడ, హైదర్షాకోట్ కాలనీ వాసులు మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా జనందోళన కమిటీ సభ్యులు మాట్లాడుతూ..100 గజాల స్థలంలో ఒక ఇల్లుంటే దాంట్లో నాలుగు కుటుంబాలుంటాయి. తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ల పిల్లలు పేదరికం వల్ల అందరూ ఒకే ఇంట్లో చిన్న చిన్న గదుల్లోనే ఉంటారు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు. నువ్వు ఒక ఇల్లు కూలగొట్టి ఆ ఇంట్లో ఉన్న నలుగురిని పరిగణనలోకి తీసుకోకుండా.. నువ్వు ఒకే 2 బెడ్రూం ఇల్లు అది కూడా 9వ అంతస్థులోకి పంపిస్తావు.. మిగితావాళ్లు అంతా ఏమవ్వాలి. వారి పరిస్థితి ఏంటని మేం మాట్లాడామన్నారు. మొట్టమొదటిది ఇల్లు కూలగొట్టొద్దు. మీకు సరైన రిహాబిలిటేషన్ ప్లాన్ ఇవ్వాలి అని చెప్పాం. మీ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందన్నారు.
మూసీ సుందరీకరణపై మూడవ రోజుకు చేరిన ఆందోళన
మధు పార్క్ అపార్ట్మెంట్ వాసుల రిలే నిరాహార దీక్ష, ఈ నిరాహార దీక్షకు మద్దతుగా మూసీ జనందోళన కమిటీ సభ్యులు, శ్రీరామ్ నగర్, గంధం గూడ, హైదర్శకోట్ కాలనీ వాసులు pic.twitter.com/hFqGzU89cg
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2026
Bandlaguda | ఔటర్ రింగ్ రోడ్ పై లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
Dhurandhar 2 Blunder | ‘ధురంధర్ 2’ యాక్షన్ సీన్లో కెమెరామెన్ ప్రత్యక్షం.. నెటిజన్ల ట్రోలింగ్.!