మాస్ లీడర్.. క్లాస్ పొలిటీషియన్
సృష్టి మనకు అందించిన అవకాశాలను అందిపుచ్చుకొని నలుగురికి సహాయపడటమే జీవిత పరమార్థం. అలాంటిది రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండేవారికి ఇతరులకు సహాయపడే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వాటిని నేతలు ఎలా సద్వినియోగం చేసుకొంటున్నారనే దాన్ని బట్టే సాధారణ రాజకీయ నాయకుడికి, అసాధారణ ప్రజా నాయకుడికి మధ్య తేడా తెలుస్తుంది.
సృష్టి మనకు అందించిన అవకాశాలను అందిపుచ్చుకొని నలుగురికి సహాయపడటమే జీవిత పరమార్థం. అలాంటిది రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండేవారికి ఇతరులకు సహాయపడే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వాటిని నేతలు ఎలా సద్వినియోగం చేసుకొంటున్నారనే దాన్ని బట్టే సాధారణ రాజకీయ నాయకుడికి, అసాధారణ ప్రజా నాయకుడికి మధ్య తేడా తెలుస్తుంది. ఆ రెండో కోవలో మొదటి వరుసలో ఉండే నాయకుడే కేటీఆర్. ప్రజాజీవితంలో మార్పు కోసం కృషి చేసిన, తపిస్తున్న నాయకుడు రామన్న.
విభిన్న శైలి, విలక్షణ నాయకత్వం, విశిష్ట విలువలు వెరసి పన్నెండేండ్ల క్రితం ‘బ్రాండ్ కేటీఆర్’ సాక్షాత్కారమైంది. రాజకీయాలు మూస పద్ధతిలో సాగుతున్న తరుణంలో కేటీఆర్ ఒక టార్చ్ బేరర్ అయ్యారు. సరికొత్త పంథాతో రాజకీయాలను, ప్రజా సేవను ఒక గేమ్‌లా కాకుండా, ఒక టాస్క్‌లా తీసుకొని చరిత్ర పుటల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని సంపాదించారు. తెలంగాణ పోరాటంలో ఉద్యమ సారథి కేసీఆర్‌కు వెన్నంటి ఉండటానికి సౌకర్యవంతమైన జీవితాన్ని, మంచి ఉద్యోగాన్ని త్యజించారు. ఉద్యమ జెండాను ఎత్తారు. రెండు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి కంకణబద్ధులయ్యారు.
అది సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవమైనా, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమైనా, ప్రజా పోరాటమైనా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్నా, బ్రాండ్ అంబాసిడర్లా తెలంగాణను ప్రమోట్ చేయాలన్నా కేటీఆర్‌ది ప్రత్యేక శైలి. పెట్టుబడులు తేవాలన్నా, ప్రజా సమస్యలపై గళమెత్తాలన్నా కేటీఆర్ తన మార్క్ చూపిస్తారు. తొమ్మిదిన్నరేండ్లపాటు మంత్రిగా తెలంగాణ ఖ్యాతిని పెంచేందుకు అహర్నిశలు శ్రమించారు. కేటీఆర్ డైనమిజాన్ని ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కేంద్ర మంత్రులు కూడా కొనియాడారు. ఇక దిగ్గజ పారిశ్రామికవేత్తలైతే తెలంగాణ పురోగతి పట్ల కేటీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి చూసి మంత్రముగ్ధులయ్యారు. ఫాక్స్‌కాన్, కిటెక్స్ లాంటి పేరుగాంచిన పరిశ్రమలు తెలంగాణకు రావడం వెనుక కేటీఆర్ కృషి అసామాన్యం… అనితర సాధ్యం.
కరోనా సమయంలో గానీ, కష్టకాలంలో గానీ ఒక ట్వీట్ చేస్తేచాలు.. తమ సమస్యకు పరిష్కారం చూపుతా రనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించిన నాయకుడు కేటీఆర్. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులునింపిన గొప్ప మనసున్న నేత కేటీఆర్.
ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు.. ఇలాంటి ఐటీ మంత్రి మాకు కూడా ఉంటే బాగుండును అని ఇతర రాష్ర్టాల వాళ్లు కితాబిచ్చారంటేనే ఆయన ఎంత బలమైన ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక వ్యక్తిత్వంలోనూ కేటీఆర్ మనసున్న నాయకుడు. రాజకీయ నాయకుల్లో ఉండే అత్యంత అరుదైన లక్షణం ముక్కుసూటితనం. అదే ఆయన ప్రత్యేకత. నిక్కచ్చిగా మాట్లాడే మాస్టర్ ఆరేటర్ కేటీఆర్. భావాన్ని బలంగా వ్యక్తీకరించే సత్తా, విషయం ఏదైనా.. సులభతరంగా వివరించగలిగే పరిజ్ఞానం… మాస్ అయినా.. క్లాస్ అయినా అదే ఊపు ఆయన సొంతం.
పండ్లున్న చెట్టుకే దెబ్బలు అన్నట్టు, దశాబ్ద కాలంగా కేటీఆర్ అంటే గిట్టనివాళ్లు ఆయనపై చేయని దుష్ప్రచారాలు లేవు. ఆయన స్థాయిని అందుకోలేక, కేటీఆర్ ధాటిని తట్టుకోలేక ప్రత్యర్థులు అభాండాలు వేసినా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.. దీటుగా తిప్పికొడుతున్నారు కేటీఆర్. దుమ్మెత్తిపోసేవాళ్లకు కేటీఆర్ ైస్టెల్లో దమ్మున్న సమాధానం చెప్పాలంటే తెలంగాణోళ్లం కదా, కడుపులో కత్తులు పెట్టుకొని పెదాల మీద నవ్వులు పెట్టుకునే రకం కాదు. ఏదైనా మొఖం మీదనె చెప్తం. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన కేసీఆర్ దళంలో సైనికుడు, మాస్ లీడర్, క్లాస్ పొలిటీషియన్ కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
– మైత్రేయ కొడకండ్ల
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

