KTR | కాంగ్రెస్ పార్టీ మూసీ అభివృద్ధి పైన ప్రణాళిక లేకుండా ముందుకు పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బులు లేవు, ప్రణాళిక లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు పైసలు ఇస్తారని, ఇప్పటివరకే ఇవ్వలేదు. వాళ్లకు అవసరమైన డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు. అందుకే మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన మా పార్టీ లైన్, అభిప్రాయాన్ని మొన్న గండిపేటలో జరిగిన పబ్లిక్ పాయింట్ పిపిటి (PPT) ప్రెజెంటేషన్ లోనే సమగ్రంగా చెప్పాము. మళ్లీ కావాలంటే మా పార్టీ తరపున ఆ రోజు ప్రజలకు ఇచ్చిన ప్రెజెంటేషన్‌ను తిరిగి మరొక్కసారి మంత్రులకు కూడా ఇస్తాము. మాకు ఇబ్బంది ఏమీ లేదు.
కానీ మంత్రులు, ప్రభుత్వం చేయాల్సిన చర్చలు ఫైవ్ స్టార్ హోటల్లోనో, సెక్రటేరియట్ లో పదిమంది అధికారుల మధ్యనో కాకుండా మూసీ బాధితులతో జరగాలి. లక్షలాది మంది మూసీ బాధితులు, భయకంపితులైన ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసేవాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. మేధా పాట్కర్ లాంటి మేధావులు సైతం, గంటా చక్రపాణి లాంటి వారు కూడా ఈ మూసీ ప్రాజెక్టు ప్రజల అభిష్టం మేరకు జరగాలని కోరుతున్నారు.
డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలైనా సంతోషమే..
డీలిమిటేషన్ అనేది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే జరగాలి. అయితే ఇప్పుడు జరిగినా స్వాగతిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. 12 ఏండ్ల కింద జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలైనా సంతోషమే. అయితే జనాభా ప్రాతిపదికన గనుక ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఆ రోజైనా, ఈ రోజైనా చెప్పేది ఒక్కటే – పాపులేషన్ ప్రాతిపదికన కాకుండా గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా చేశారో, అదే విధంగా ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందని సూచించారు.
దక్షిణ భారతదేశం అంతా కలిసి దేశంలోని 24 శాతం రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉంది. దానికి నష్టం రాకుండా కొనసాగించాలని కోరుతున్నాము. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు కూడా పెంచుతామంటున్నారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాము. అసెంబ్లీ సీట్లు పెంచితే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండటం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. అశ్వారావుపేట లాంటి దగ్గర లక్షా ముప్పై వేల ఓట్లే ఉంటే, శేరిలింగంపల్లి దగ్గర తొమ్మిది లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇంత భారీ వ్యత్యాసం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఎకనామిక్ ఇండికేటర్స్ లో అగ్రభాగాన ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఆనాడు చెప్పిన కుటుంబ నియంత్రణ పాటించాయి కాబట్టి దక్షిణ భారతదేశానికి, దక్షిణ భారత రాష్ట్రాలకి నష్టం జరగకుండా, వాటి గొంతు కోయకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తాము.
TDR కుంభకోణంపై సమగ్ర విచారణ..
రాష్ట్రంలో టీడీఆర్ (TDR) అనేది అతి పెద్ద కుంభకోణం. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి అనుచరులు TDRని అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ భారీ స్కామ్‌కు తెరలేపబోతున్నారని సంవత్సరమున్నర క్రితమే నేను స్పష్టంగా చెప్పాను. గత సంవత్సరం బడ్జెట్ సెషన్ లో కూడా TDRలు కొంటున్నారు. ఆ తర్వాత TDRలను ఖచ్చితంగా వాడాలి అనే నిబంధనలు తీసుకువస్తారు అనే మాటను స్పష్టంగా చెప్పాను. కరెక్టుగా అదే విధంగా ఇప్పుడు బలవంతంగా TDRలు కొనుగోలు చేసేలా రియల్ ఎస్టేట్ సంస్థలకు నిర్దేశిస్తూ కొత్త రియల్ ఎస్టేట్ నిబంధనలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఇది ఖచ్చితంగా భారీ కుంభకోణమన్నారు.
మా ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఈ TDR కుంభకోణం పైన సమగ్ర విచారణ జరిపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు . ఈ TDR ద్వారా నిర్వాసితుల దగ్గర నుంచి అతి తక్కువకు కొనుగోలు చేసి అడ్డగోలుగా TDR అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకి ఖచ్చితంగా వారి పాత్రను బయటపెడతాము. మొత్తం ఈ TDR లో ఎవరు అమ్మారు, ఎవరు కొంటున్నారు, ఎవరు ఎవరికి మళ్ళీ అమ్ముతున్నారు అన్న ప్రతి వివరాలు తెలిసిపోతాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ స్కామ్ కి పాల్పడుతున్న ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో TDR అంటే ‘తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్’ అయిపోయాయి. ఎవరెవరి చేతుల్లో ఏ విధంగా TDR లు మారుతున్నాయి, ఎందుకు మారుతున్నాయి అన్న ప్రతి అంశం మాకు తెలుసు. రేవంత్ రెడ్డి ఈ TDRను తన కుటుంబానికి ఒక ఏటీఎంలా మార్చుకున్నారు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి ఈ TDR స్కామ్ ని పూర్తిగా బయటపెడతామన్నారు.
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు