హైదరాబాద్ : కరెంట్ బిల్లు(Current Bill) కట్టమన్నందుకు విద్యుత్ సిబ్బందిపై దాడి చేసిన సంఘటన కుల్సంపుర(Kulsumpura) పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మొబైల్ షాప్ యజమాని మూడు నెలలుగా కరెంట్ బిల్లు కట్టడం లేదు. దీంతో విద్యుత్ నిలిపివేసేందుకు వెళ్లిన లైన్మెన్ శ్రీనివాస్‌పై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. దుండగుల దాడిలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు మంగళ్‌హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.