బేగంపేట్ నవంబర్ 23: ఆశ వర్కర్లకు(ASHA workers) కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ శనివారం ఆశ వర్కర్లకు మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలను ఇచ్చిందని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చాక ఏడాది కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశ వర్కర్లకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లకు ఉమాదేవి, విజయలక్ష్మి, శశికళ, మానస, మమత, తదితరులు పాల్గొన్నారు.