హైదరాబాద్ : త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో(Muthyalamma temple) నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) తెలిపారు. సికింద్రాబాద్లోని (Secunderabad)ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీ వాసుల సమక్షంలో నిర్వహిస్తామన్నారు. ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండాలనేది మా ఆలోచన అన్నారు. భక్తులు సంయమనం పాటించాలన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వైభవంగా నిర్వహిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులపై పోరాటం చేస్తా : కేటీఆర్
KTR | ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం.. ఇదిగో సాక్ష్యం : కేటీఆర్
KTR | అందిన కాడికి దోచుకో.. బామ్మర్ది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్