హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం(Thulam bangaram) ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani ) ప్రశ్నించారు. బుధవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తులం బంగారం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది దాటినా తులం బంగారం ఇవ్వడం లేదు. ఇచ్చిన హామీని ఎప్పుడు నిలుపుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత విధానాలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరంతరం పోరాడుతామన్నారు.
ఇవి కూడా చదవండి..