మల్లాపూర్, నవంబర్ 4 : కాలనీలలో తాగునీటి సమస్య(Drinking water) లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) తెలిపారు. సోమవారం ఆయన మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ జైతన్యనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ సొసైటీలో నిర్మాణం పూర్తి చేసుకున్న పైపు లైను ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకు రావాలని కాలనీ వాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు జి. శ్రీనివాస్‌రెడ్డి, గొల్లూరి అంజయ్య, జలమండలి మేనేజర్ వేణుగోపాల్, సొసైటి సభ్యులు పాల్గొన్నారు.