ఉప్పల్, జనవరి 5 : సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని కాపాడుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నాచారంలోని అన్నపూర్ణకాలనీలో మున్నురుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bhandari ), కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ హాజరయ్యారు. ముగ్గులను పరిశీలించి, మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీవాసులు, సంఘాల ప్రతినిధులు సమిష్టిగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు పూర్తిచేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్న్సనాగేశ్వర్రావు, నేతలు దేవులపల్లి యాదగిరి, రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్