చర్లపల్లి, జనవరి 9 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి చేయను న్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari) పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవేత్తల భవనంలో(సీఐఏ)చర్లపల్లి ఫాస్టర్స్ ఫెలోషీప్ అధ్యక్షుడు బీఏ.పాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్(Semi Christmas) వేడుకలకు ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, ముఖ్యంగా క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చిల వద్ద సౌకర్యాలు కల్పించమన్నారు.
నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలలో ఉన్న చర్చిల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా సౌకర్యాలు కల్పించామని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ను పలు పార్టీలకు చెందిన నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్, నియోజకవర్గం క్రిస్టియన్ సంఘాల కోఆర్దినేటర్ సద్గుణరావు, జాన్, మణిక్యాల్రావు, సామ్యేల్, విద్యసాగర్, స్టీఫెన్, జైపాల్, నాగేశ్వర్రావు, శేఖర్, కిశోర్, సాధు సుందర్‌సింగ్, డానియల్, సామెల్, సాల్మాన్‌రాజు, రాజు, అనిల్ లోక్నాధ్, డాక్టర్ మాదాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్.. మధ్యాహ్నం వరకు 15 ప్రశ్నలు..!