Medpally vivek reddy | ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జగిత్యాలలో జరుగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు మేడిపల్లి వివేక్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి , అమరవీరుల త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గొప్ప పరిపాలనాదక్షకుడని పేర్కొన్నారు.
కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతుందని వివరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే బీఆర్ఎస్ నాయకులను వేదింపులకు గురిచేస్తూ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు మళ్లీ సంతోషంగా ఉండాలంటే రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు.
సభా ప్రాంగణానికి ప్రజలు తరలిరాకుండా రోడ్డును తవ్వి ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. వేసవి సెలవులు వచ్చిన తొలిరోజే ఇద్దరి విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్‌పూర్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు గ్రామ పరిధిలో ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఉన్న గుంతలో ఉన్న నీటిలో ఈత కొట్టేందుకు దిగారు. నలుగురిలో ఇద్దరు లోతులోకి వెళ్లి నీట మునిగి మృతి చెందారు. మృతి చెందిన వారిని ఉమన్(14), 9వ తరగతి, ఇర్ఫాన్(12) ఏడవ తరగతిగా గుర్తించారు.
Pahalgam attack | పహల్గాం దాడికి ఏడాది.. పాక్ తీవ్రవాదంపై అమెరికాలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన భారత్
Bike Rally | హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్‌లో బైక్ ర్యాలీ
Watch: కలెక్టర్‌తో రైతుల సమావేశంలో కోతి.. తర్వాత ఏం జరిగిందంటే..?