కాచిగూడ,జూలై 15 : మనస్థాపంతో రైలు(Train) కిందపడి కూలి ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వీధి బావి ప్రాంతానికి చెందిన వెంకటస్వామి కుమారుడు గణేశ్(31)వృత్తిరీత్యా కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. కొన్నేండ్లుగా తాగుడుకు బానిస కావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
గత కొన్ని నెలలుగా భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపంతో ఆదివారం రాత్రి సీతాఫల్మండి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం-1లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గణేశ్ మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.