e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home హైదరాబాద్‌ నాటి పోరాట ఫలితమే నేటి సంక్షేమ ఫలాలు

నాటి పోరాట ఫలితమే నేటి సంక్షేమ ఫలాలు

నాటి పోరాట ఫలితమే నేటి సంక్షేమ ఫలాలు

జూబ్లీహిల్స్‌ జోన్‌ బృందం,/బంజారాహిల్స్‌/ ఖైరతా బాద్‌/అమీర్‌పేట్‌/బేగంపేట్‌/బన్సీలాల్‌పేట్‌ జూన్‌2: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్పొరేటర్లు, అధికారులు పలుపాంతాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి అమరవీరులను స్మరించు కున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం యూసుఫ్‌గూడలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్‌ చూపిన తెగువ అనితర సాధ్యమైనదని, నాటి పోరాట ఫలితంగానే నేడు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్‌ పటేల్‌, సీఎన్‌ రెడ్డి, దేదీప్యరావు తదితరులు పాల్గొన్నారు. బోరబండ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో నగర మాజీ డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్‌ బాబాఫసియుద్దీన్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. వెంగళరావునగర్‌ డివిజన్‌లో కార్పొరేటర్‌ దేదీప్యరావు ,ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ సైదులు , డివిజన్‌లోని నలంద విశ్వవిద్యాలయం ఆవరణలో చైర్మన్‌ ఎం.శ్రీనివాసరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరాంనగర్‌ యూపీహెచ్‌సీలో,బోరబండ డివిజన్‌ వినాయక్‌నగర్‌ పీహెచ్‌సీలో ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్‌ ఆనురాధ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఖైరతాబాద్‌ డివిజన్‌లో కార్పొరేటర్‌ పి. విజయారెడ్డి నేతృత్వంలో లైబ్రరీ చౌరస్తా, సోమాజిగూడ బస్తీ కమ్యూనిటీ హాల్‌ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వద్ద రోగుల సహాయకులు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. సోమాజిగూడ డివిజన్‌లో కార్పొరేటర్‌ వనం సంగీత శ్రీనివాస్‌ యాదవ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. కపాడియా లేన్‌లో హైదరాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ కె. ప్రసన్న రామ్మూర్తి అవతరణ వేడుకలు నిర్వహించారు. నారాయణగూడలో తెలంగాణ జూనియర్‌ కాలేజెస్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ అసొసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ లక్ష్మయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బుధవారం ఫిలింనగర్‌లోని శంకర్‌ విలాస్‌ చౌరస్తా వద్ద జాతీయ జెండా ఎగురవేశారు.బంగారు తెలంగాణను సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు.

జూబ్లీహిల్స్‌లోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ. కె.సీతారామారావు జెండా ఎగురవేశారు. రహమత్‌నగర్‌ డివిజన్‌లో కార్పొరేటర్‌ సీఎన్‌.రెడ్డి పలు ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేశారు.శ్రీనగర్‌కాలనీ గౌరీశంకర్‌నగర్‌ వద్ద కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆమె వందనం చేశారు. అమీర్‌పేట్‌ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ ఎన్‌.శేషుకుమారి జెండాను ఆవిష్కరించారు. బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ బోయిగూడలో ఉద్యమకారుడు ఎస్‌.రాజేందర్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ కె.హేమలత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పద్మారావునగర్‌లోని స్కై ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వృద్ధులకు, దివ్యాంగులకు భోజనం సమకూర్చారు.

హమాలి బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం సుకన్య జాతీయ జెండాను ఎగురవేశారు.అంగన్‌వాడీ నుంచి ఐదేండ్లు నిండిన 13 మంది విద్యార్థులను ఒకటవ తరగతిలో చేర్చుకున్నారు. రామకృష్ణవేణి సేవా సొసైటీ అధ్యక్షుడు కొత్వాల్‌ దయానంద్‌, కార్యదర్శి కొత్వాల్‌ సాయికుమార్‌ ఆధ్వర్యంలో గాంధీ దవాఖాన వద్ద రోగి సహాయకులకు అన్నదానం చేశారు. ఐఏడీవీఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గాంధీ దవాఖాన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్‌ కటకం భూమేశ్‌ కుమార్‌, తన కుటుంబ సభ్యులతో కలిసి ‘వాత్సల్యం’ అనాథాశ్రమానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. బేగంపేట డివిజన్‌లోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్‌ కమిటీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి జెండా ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాటి పోరాట ఫలితమే నేటి సంక్షేమ ఫలాలు

ట్రెండింగ్‌

Advertisement