Madapur PS | హైదరాబాద్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా అవినీతి బయటపడ్దది. మాదాపూర్ పీఎస్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఓ కేసు విషయంలో సహకారం అందిస్తానని ఎస్ఐ వినయ్ ఫిర్యాదుదారుడిని రూ.50 వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి దగ్గర నుంచి నగదు స్వీరిస్తున్న సమయంలో ఎస్ఐ వినయ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచాన్ని సీజ్ చేసిన పోలీసులు వినయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఎస్ఐ వసూళ్లకు సంబంధించి ఉన్నతాధికారుల లింక్ కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ వినయ్ అవినీతి సొమ్ముపై నిఘా పెట్టిన ఏసీబీ.. సీఐ కృష్ణమోహన్, ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై ఆరా తీస్తోంది.
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు.. సాయం చేయడానికి ఎవరూ లేరు.. నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన
NTR | జోర్డాన్‌లో ఎన్టీఆర్ దుమ్మురేపుతున్న ‘డ్రాగన్’ యాక్షన్… ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!
Epstein files | ఎప్స్టీన్తో విందులో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్.. ఫొటోలు విడుదల