Doctorate | గణిత శాస్త్రంలో ‘ఎఫెక్ట్స్ అఫ్ బౌండరీ స్లిప్ అండ్ వేరిబుల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆన్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ అఫ్ టూ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఇన్ ఎ వర్టికల్ ఛానల్’ అనే అంశంలో చేసిన పరిశోధనకుగాను రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీ చెందిన వనజ గోష్టికి ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఉన్న భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది.
హైదరాబాద్‌లోని గీతాంజలి కాలేజీలో గణిత శాస్త్ర ఆచార్యులు డాక్టర్ జీ శ్రీనివాస్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనలను గుర్తించి భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ వనజ గోష్టికి ఈ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. వనజ గోష్టి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా ఆమె భర్త చక్రపాణి రెడ్డి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహా అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
వనజ గోష్టి ప్రస్తుతం హైదరాబాద్ లోని శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు