KTR | ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లి గత 45 రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి ముత్యంరెడ్డి మణిదీప్ రెడ్డి ఉదంతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై మణిదీప్ రెడ్డి తల్లిదండ్రులు ముత్యంరెడ్డి, మర్ణతలను స్వయంగా కలిసి మాట్లాడి.. కొడుకు ఆచూకీ తెలియక అల్లాడిపోతున్న ఆ తల్లిదండ్రులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి భరోసాను, ధైర్యాన్ని ఇచ్చారు.
ఒక సామాన్య కుటుంబం ఎన్నో ఆశలతో తమ బిడ్డలను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపితే, ఇవ్వాళ ఆ బిడ్డ ఆచూకీ లేకుండా పోవడం ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చిందన్నారు కేటీఆర్. స్థానిక పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతోనే బాధిత తల్లిదండ్రులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం దురదృష్టకరం. హైకోర్టు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి స్థానిక ప్రభుత్వంతో, అక్కడి అధికారులతో మాట్లాడి మణిదీప్ రెడ్డిని సురక్షితంగా వెతికి పట్టుకునేలా కేంద్ర విదేశాంగ శాఖ తక్షణమే రంగంలోకి దిగాలన్నారు. తెలంగాణ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించి, విదేశాంగ శాఖ ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి వీలయినంత తొందరగా వెతికిపట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఫిన్లాండ్లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం.. బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా
ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లి, గత 45 రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి ముత్యంరెడ్డి మణిదీప్ రెడ్డి ఉదంతంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం… https://t.co/h628Mq0Rdz pic.twitter.com/K4M3UeTNze
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2026