KTR | 60 ఏండ్లు పాలించిన ఈ కాంగ్రెస్ సన్నాసులు నల్గొండకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ కేసీఆర్ పదేళ్లలో నల్గొండలోని చివరి మడివరకు నీళ్లు పారేలా కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యువ నాయకుడు పిల్లుట్ల రఘు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో పిల్లుట్ల రఘుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అవును కేసీఆర్ అప్పుడుచేసిండు.. కేసీఆర్ అప్పు ఎందుకు చేసిండంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు వేయడానికి అప్పు చేసిండు. కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా రైతుబంధు అందించారు. వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలకు 6.50 లక్షల మంది చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పించే దానికి అప్పుడు చేసిండు కేసీఆర్ అని అన్నారు.
గతంలో కేసీఆర్ రాకముందు మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు కూడా లేకపోతే వాటిని 32 మెడికల్ కాలేజీలు చేయడానికి, ప్రతీ జిల్లాలో పేద విద్యార్థులకు నర్సింగ్ విద్య అందించడానికి 32 మెడికల్ కాలేజీలు, 32 నర్సింగ్ కాలేజీలు కట్టించడానికి అప్పు చేశారు. ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలతో వైద్య విద్యను అందించారు. కరెంటు కష్టాల రాష్ట్రాన్ని 24 గంటల విద్యుత్ రాష్ట్రంగా మార్చారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణాన్ని పెంచారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు. నల్గొండను వేధించిన ఫ్లోరోసిస్‌ను మిషన్ భగీరథతో తరిమికొట్టిన నాయకుడు మన కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. దామరచర్లలో అతిపెద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను స్థాపించినది కూడా కేసీఆర్. యావత్ దేశ ప్రజలు అబ్బురపడేలా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నాయకుడు మన కేసీఆర్ అని అన్నారు.
కేసీఆర్ గారు 70 లక్షల మంది రైతులకు కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా రైతుబంధు అందించారు.
వెయ్యి గురుకులాలతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారు.
ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలతో వైద్య విద్యను అందించారు.
కరెంటు కష్టాల రాష్ట్రాన్ని 24 గంటల విద్యుత్ రాష్ట్రంగా మార్చారు.… pic.twitter.com/Gl6chcN9Wr
— BRS Party (@BRSparty) April 26, 2026