Jeevan Reddy | రైతు బీమా అది ఉన్నదా లేదా..? ఎవరికీ తెలుస్తలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 7600 మంది రైతులు వివిధ ప్రమాదాలు, అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతే వాళ్లకు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాల్సిన బీమా ప్రీమియం చెల్లించలేక వారు ప్రభుత్వం నుంచి పొందే సహాయం పొందలేకపోతున్నారంటే ప్రభుత్వం విధానం ఎలా ఉందో మనకు తెలిసొస్తుందన్నారు.
ఇదంతా చూస్తే రాబోయే కాలంలో రైతు బీమాను ఏవిధంగా ఎగ్గొట్టాలనే కుట్ర ప్రభుత్వం చేస్తుందనేది కనిపిస్తోందన్నారు జీవన్ రెడ్డి. రైతు బీమా కేసీఆర్ ప్రారంభించిన పథకం కాబట్టి దీన్ని ఏవిధంగా కనుమరుగు చేయాలనే కుట్ర జరుగుతున్నట్టు కనబడుతోంది. దయచేసి మీరింకా మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలి కానీ.. గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని ఆలోచిస్తే మిమ్మల్ని కనుమరుగు దినమొస్తదని హెచ్చరించారు.
రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది
ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో 7600 మంది చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రాలేదు
గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తే ప్రజలు ఈ కాంగ్రెస్ నాయకులను కనుమరుగు చేస్తారు… https://t.co/RkOutygqLG pic.twitter.com/suHNeiroE8
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2026
Uttar Pradesh | బ్యాంక్ లాకర్లో పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు మాయం.. యూపీలో ఘటన
Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. ఆసక్తికరంగా టీజర్!