Pattlolla karthik Reddy | శంషాబాద్ భూ కుంభకోణం గురించి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు స్పందిస్తరేమో.. బహుశా తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నది ఈ ప్రభుత్వం.. అక్కడి నుంచి ఎమ్మార్వోను బదిలీ చేశారు. అంటే తప్పు జరిగిందనే కదా అర్థం.. కలెక్టర్ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.. అంటే ఏంటర్థం తప్పు జరిగినట్టే కదా అన్నారు.
కరీంగనర్‌లో ఓ ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వడ్లు, మక్కలు కొనండయ్యా అంటే ఆయనను సస్పెండ్ చేస్తరు. హైదరాబాద్ శంషాబాద్‌లో మన ఎయిర్ పోర్టు నడిబొడ్డున పక్కనే ఉన్న ప్రాంతంలో ఎమ్మార్వో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రొసీడింగ్స్ ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తే ట్రాన్స్ ఫర్ చేస్తరా..? డిస్మిస్ చేయరా..? అని ప్రశ్నించారు. మీ విజిలెన్స్ ఎంక్వైరీ ఎక్కడుంది..అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు..? మీరు పేరు చెప్పకుండా ముసుగులో గుద్దులాట ఎందుకు ఆడుతున్నరు. అందరికీ తెలుసు కదా..? ఇప్పుడు TMRIES స్కూళ్లకు వైస్ చైర్మన్, ఒక చిల్లర గాడు దీని వెనుక ఉన్నాడని అట్లాంటి వ్యక్తి పేరు చెప్పలేక సిగ్గుతో మేం పేరు చెప్తలేం.. అట్లాంటి చిల్లరగాడు అర్హత లేని వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుతున్నాడంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సిగ్గేస్తలేదా..? అని ప్రశ్నించారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయన ఇంటికాడికి పోయి కాపలా కాస్తున్నరట. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ మున్సిపల్, రెవన్యూ డిపార్ట్మెంట్లలో పోస్టింగ్స్ ఆయన సిఫారసుతో జరుగుతుందట. ఎన్ని ఎన్నికలు గెలిచిండు.. గెలిపించిండని ఆయన సంక నాకుతున్నరు వీరందరు అని అడుగుతున్నానన్నారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మార్వో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. ఎమ్మార్వోను ట్రాన్స్ఫర్ చేశారంటే, కలెక్టర్ సంజాయిషీ ఇచ్చారు అంటే తప్పు జరిగింది అనే కదా..? అన్నారు.
అసలు శంషాబాద్ భూ కుంభకోణం వెనుక ఉన్నది ఎవరు, అతని పేరు ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నారు
TMRIES స్కూళ్లకు వైస్ చైర్మన్, ఒక చిల్లర గాడు దీని వెనుక ఉన్నాడని చెప్పడానికి సిగ్గుపడి చెప్పట్లేదు
ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం అతని ఇంటి ముందు అధికారులు లైన్లో నిలబడుతున్నారు
ఏ అర్హత… https://t.co/sLRWFoG1Ln pic.twitter.com/HFquzhkscR
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026