MP Mallu Ravi | పిల్లలన్నాక తప్పు చేస్తారు… దానికే రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదు : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
MP Mallu Ravi | పోక్సో కేసు ఘటనకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాసంఘాలు, విద్యార్థులతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
MP Mallu Ravi | పోక్సో కేసులో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాసంఘాలు, విద్యార్థులతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి.
ఈ క్రమంలో పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. దానికే రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదని బండి సంజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ అతన్నేమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం.. ఆయన హోంమంత్రిగా ఉన్నాడు. అయినా కానీ ఆయన వచ్చారు సరెండర్ అయ్యారు. కేసు పెట్టారు. మళ్లీ ఇప్పుడు వేరే రకంగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతయన్నారు.
నిన్న మొన్న బీజేపీ పార్టీ ఎట్లా ఉందో.. ఒకసారి ఆ బీజేపీ పార్టీ హైకమాండ్‌ను చూడాలని చెప్తున్నాం. ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు.. పేర్లు నేను చెప్పను. మీ అందరికీ తెలుసు. వాళ్లు ఈ సమస్య రాగానే బండి సంజయ్‌ను సస్పెండ్ చేయాలి. రాజీనామా చేయాలి బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. ఊరికెనో అది వారి పార్టీలో ఉన్న క్రమశిక్షణ. ఆ పేరుతో బండి సంజయ్‌ను పదవిలో నుంచి దించితే.. మేం పదవిలోకి వస్తామని చెప్పేవాళ్లే ఎక్కువయ్యారన్నారు. ఇప్పుడీ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
పిల్లల అన్నాక తప్పు చేస్తారు దానికే రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదు
బండి సంజయ్ తన కొడుకును దాచిపెట్టకుండా సరెండర్ చేశాడు
– కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి pic.twitter.com/UyN8eVY6FX
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026
Read Also :
Helle Lyng: ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు హెల్లీ లింగ్ ఎవరో తెలుసా?
Bhuwan Chandra Khanduri | ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి మృతి.. సీఎం పుష్కర్ సింగ్ సంతాపం
White Heads | వేసవిలో ముఖంపై అధికంగా కనిపించే వైట్ హెడ్స్.. కారణాలు ఏంటి.. ఏం చేయాలి..?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

