White Heads | వేసవిలో ముఖంపై అధికంగా కనిపించే వైట్ హెడ్స్.. కారణాలు ఏంటి.. ఏం చేయాలి..?
వేసవి కాలంలో ముక్కుపై చిన్న చిన్న తెల్లని మొటిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కోనే ఉంటారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో చర్మంలో ఆయిల్ ఉత్పత్తి కూడా అధికమవుతుంది. దీంతో ముఖ్యంగా ముక్కు భాగంలో వైట్‌హెడ్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
White Heads | వేసవి కాలంలో ముక్కుపై చిన్న చిన్న తెల్లని మొటిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కోనే ఉంటారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో చర్మంలో ఆయిల్ ఉత్పత్తి కూడా అధికమవుతుంది. దీంతో ముఖ్యంగా ముక్కు భాగంలో వైట్‌హెడ్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి సాధారణ మొటిమల్లా కనిపించినా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫ్లమేటరీ యాక్నేగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వైట్‌హెడ్స్ అనేవి చర్మ రంధ్రాలు ఆయిల్, మృత చర్మ కణాలు, బ్యాక్టీరియాతో మూసుకుపోయినప్పుడు ఏర్పడతాయి. బ్లాక్హెడ్స్లా బయటకు తెరిచి ఉండకపోవడంతో ఇవి తెల్లని లేదా చర్మరంగు గడ్డల్లా కనిపిస్తాయి. ముఖ్యంగా వేసవిలో వేడి, చెమట, తేమ కలిసి ఈ సమస్యను మరింత పెంచుతాయి.
కారణాలు ఇవే..
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఆయిల్ ను విడుదల చేస్తాయి. ఈ అదనపు ఆయిల్ దుమ్ము, మృత కణాలతో కలిసిపోవడంతో రంధ్రాలు సులభంగా మూసుకుపోతాయి. ఫలితంగా ముక్కుపై వైట్‌హెడ్స్ ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చెమట కూడా ఈ సమస్యలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరాన్ని చల్లబరచడానికి చెమట అవసరమే అయినప్పటికీ, అధిక తేమ ఉన్న వాతావరణంలో అది సరిగా ఆవిరి కాక చర్మంపై మలినాలను బంధిస్తుంది. దీని వల్ల పోర్స్ మరింత బ్లాక్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా ముక్కు భాగం టీ-జోన్ లో ఉండటంతో అక్కడ ఆయిల్ గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముక్కు భాగం సహజంగానే ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. పైగా అక్కడి రంధ్రాలు కొంచెం పెద్దవిగా ఉండటం వల్ల మలినాలు త్వరగా పేరుకుపోయి మొటిమలకు దారితీస్తాయని చర్మ నిపుణులు వివరిస్తున్నారు.
ఇలా చేయవద్దు..
అలాగే ముఖాన్ని పదేపదే చేతులతో తాకడం, చెమట తుడుచుకోవడం కూడా బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతుంది. ఇది వైట్‌హెడ్స్‌ను మరింత తీవ్రమయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. వైట్‌హెడ్స్ నివారణకు కఠినమైన ట్రీట్మెంట్స్ కంటే మృదువైన, క్రమబద్ధమైన చర్మ సంరక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండు సార్లు మైల్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేయడం ద్వారా అదనపు ఆయిల్, దుమ్ము తొలగించవచ్చు. అయితే చర్మాన్ని అతిగా రుద్దడం లేదా గట్టిగా క్లీన్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇక వారంలో ఒకటి లేదా రెండు సార్లు సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేయడం ద్వారా మృత కణాలు తొలగి పోర్స్ శుభ్రపడతాయి. అయితే అతిగా ఎక్స్ఫోలియేషన్ చేస్తే చర్మం ఇర్రిటేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
రోజూ తగినంత నీళ్లను తాగాలి..
అదే విధంగా వేసవిలో హెవీ క్రీమ్స్, ఆయిల్ బేస్డ్ ఉత్పత్తులకు బదులుగా ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్స్, సన్‌స్క్రీన్స్ ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే తగినంత నీరు తాగడం ద్వారా చర్మంలోని ఆయిల్ బ్యాలెన్స్ మెరుగుపడుతుందని చెబుతున్నారు. వైట్‌హెడ్స్‌ను చేతులతో నొక్కి పగలగొట్టడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా చర్మంలో లోతుగా వెళ్లి ఇన్ఫ్లమేషన్, మచ్చలు లేదా గాయాలకు దారితీయవచ్చని పేర్కొంటున్నారు. సాధారణ చర్మ సంరక్షణతో తగ్గకపోతే లేదా వైట్‌హెడ్స్ తరచూ వస్తుంటే చర్మ వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అవసరమైతే చర్మానికి సరిపోయే ప్రత్యేక ట్రీట్మెంట్స్ లేదా మందులు సూచిస్తారు. వేసవి వేడి, చెమట, అధిక ఆయిల్ ఉత్పత్తి కలిసి వైట్‌హెడ్స్‌కు అనుకూల పరిస్థితులు సృష్టిస్తాయి. అయితే సరైన స్కిన్‌కేర్ అలవాట్లు పాటిస్తే ఈ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- White Heads
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

